శ్రీశైలం ప్రాజెక్టును గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు ఆదివారం పరిశీలించారు. ఆనకట్ట రేడియల్ క్రెస్ట్ గేట్లను చూసిన ఆయన, పదో నంబర్ గేటు నుంచి నీటి లీకేజీ 10శాతం కంటే తక్కువగా ఉందని, అది ప్రమాదకరమేమీ కాదన్నారు. గేట్లకు తరచూ పెయింటింగ్ అవసరమని తెలిపారు. ఐదేళ్లలో కొత్త గేట్లు వేసే పని చేపట్టకపోతే తుంగభద్ర లాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందన్నారు.