పట్టణ సీఐ గా బాధ్యతలు స్వీకరించిన ఓబులేసు

70చూసినవారు
పట్టణ సీఐ గా బాధ్యతలు స్వీకరించిన ఓబులేసు
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణ నూతన సీఐగా ఓబులేసు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆత్మకూరులో పని చేస్తున్న సీఐ లక్ష్మీనారాయణను ఉన్నతాధికారులు అన్నమయ్య జిల్లాకు బదిలీ చేయగా ఆయన స్థానంలో తిరుపతి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓబులేసును ఆత్మకూరుకు బదిలీ చేశారు. సిఐ ఓబులేసు మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్