నంద్యాల జిల్లా మహానంది ఆలయ పరిసరాల్లో క్షుద్రపూజల ఆదివారం కలకలం రేపింది. గరుడనంది ఆలయం సమీపంలో క్షుద్రపూజల ఆనవాళ్ళు కనిపించాయి. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మహిళ దుస్తులు స్థానికులు ఆదివారం గమనించారు. క్షుద్రపూజల ఆనవాళ్ళు చూసి భక్తులు, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయంపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు భక్తులు కోరుతున్నారు.