శ్రీశైలం నియోజకవర్గ కేంద్రం ఆత్మకూరు పట్టణంలో ఉమామి తబ్లిగ్ ఇజ్ తెమా జరగడం శుభపరిణామమని ఇది ఆత్మకూర్ ప్రాంత ప్రజలపై అల్లాకు ఉన్న దయ్యే అని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఫారుక్, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ ఆదిరాజ్ సింగ్ లు అన్నారు. శుక్రవారం పట్టణ శివారులోని దోర్నాల రోడ్డులో జరిగే ఇజ్ తెమా జరుగు స్థలాన్ని, పనులను మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు.