శ్రీశైలంలో జూలై 9న ఆషాఢమాస మూలా నక్షత్రం సందర్భంగా లోకకల్యాణం కోసం శ్రీశైల మహాక్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాళమ్మ వారికి దేవస్థానం తరుపున బోనం సమర్పించబడుతుందని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి విశేషంగా పూజాదికాలు జరిపించబడుతాయి. సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని పూజలు నిర్వహిస్తారన్నారు.