చెంచులక్ష్మి గూడెంలో వైద్య శిబిరం నిర్వహించిన అధికారులు

56చూసినవారు
చెంచులక్ష్మి గూడెంలో వైద్య శిబిరం నిర్వహించిన అధికారులు
నంద్యాల జిల్లా మహానంది సమీపంలోని చెంచులక్ష్మి గూడెంలో మండల వైద్యాధికారులు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బుధవారం మహానంది మండల కేంద్రం తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ల్యాబ్ టెక్నీషియన్ సికిందర్ గిరిజన ప్రజలు, చిన్నారుల నుంచి రక్త నమూనాల సేకరించి పరీక్షలు నిర్వహించారు. వర్షాలు కురుస్తున్నడంతో విష జరాలు ప్రబలే అవకాశం ఉందని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.