శ్రీశైలం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల సమీక్ష సోమవారం నిర్వహించారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా దేవదాయశాఖ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా నియమితులైన దేవదాయశాఖ జాయింట్ కమీషనర్ ఎస్. ఎస్. చంద్రశేఖర ఆజాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావుతో కలిసి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.