ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల క్షేత్రానికి గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో బుధవారం నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పర్యటనలో ఎలాంటి అపసృతులు చోటుచేసుకోకుండా పగడ్బందీగా వ్యవహరించాలని పోలీస్ సిబ్బందికి ఆదేశించారు.