సంక్రాంతి పండుగ సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలుస్తుందని మహానంది ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని గురువారం పేర్కొన్నారు. మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాల వేడుకలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు తెలుగువారి లోగిల్లు రంగురంగుల ముగ్గులతో ముస్తాబవుతాయన్నారు. ఎంపీడీవో మహబూబ్ దౌల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.