శ్రీశైలంలో నందీశ్వరస్వామివారికి విశేషపూజలు త్రయోదశి ఘడియలు రావడంతో నందీశ్వరస్వామి వారికి పరోక్షసేవగా శుక్రవారం విశేషార్చన జరిపించారు. త్రయోదశిరోజులలో దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. అయితే ప్రతి నెలలో కూడా త్రయోదశి రోజులలో అనగా శుద్ధ త్రయోదశి మరియు బహుళ త్రయోదశి రోజులలో భక్తులు నందీశ్వరస్వామివారి పూజను పరోక్షసేవగా జరిపించుకునే అవకాశం కూడా కల్పించబడింది.