అంకాళమ్మ తల్లికి విశేష పూజలు

81చూసినవారు
అంకాళమ్మ తల్లికి విశేష పూజలు
లోక కల్యాణార్థం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత శ్రీ అంకాళమ్మ వారికి శుక్రవారం అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. శ్రీ అంకాళమ్మ వారికి సర్కారిసేవగా ఈ విశేష పూజలు జరిపించబడుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ అంకాళమ్మ వారికి లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. అనంతరం పంచామృతాభిషేకం, హరిద్దోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, విశేష అభిషేకం పూజలు నిర్వహించబడ్డాయి.

సంబంధిత పోస్ట్