శ్రీశైల మల్లికార్జునస్వామి వారి పరమ భక్తులలో ఒకరైన శివశరణి అక్కమహాదేవి జయంత్యోత్సవం శనివారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి వారికి పంచామృత అభిషేకం, జలాభిషేకం తదితర విశేషపూజలు కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు జరిపించారు. ఈ విశేషకార్యక్రమంలో భాగంగా ముందుగా జయంత్యోత్సవ సంకల్పం పఠించబడింది. కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపించారు.