రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్, మహిళలపై అఘాయిత్యాలపై అవగాహన ఆదివారం ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ అవగాహన కల్పించారు. టూటౌన్ అవుట్ పోస్టులో స్థానిక డ్రైవర్లు, ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అతివేగం, సైబర్ క్రైమ్, మహిళలపై అఘాయిత్యాల గురించి మాట్లాడారు. సెల్ ఫోన్ వాడకం, అపరిచిత కాల్స్, డిజిటల్ పేమెంట్లపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీఐ చంద్రబాబు, ఎస్సై సుబ్బారెడ్డి పాల్గొన్నారు.