శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు వసతి కల్పన, సౌకర్యవంతమైన దర్శనం ఏర్పాట్లు, అన్నప్రసాదవితరణ మరియు క్షేత్రపారిశుద్ధ్యం మొదలైన అంశాలకు సంబంధించి సిబ్బంది అందరు కూడా నిరంతరం శ్రమిస్తూ మెరుగైన సేవలందిస్తుండాలని కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు సూచించారు. పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాలు కూడా పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు.