శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 35,016 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 6,560 క్యూసెక్కుల నీరు వచ్చి, మొత్తం 41,576 క్యూసెక్కులు చేరుతున్నాయి. నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో జూరాల-శ్రీశైలం మధ్య ఉన్న చారిత్రక సంగమేశ్వర క్షేత్రం వరద నీటితో చుట్టుముట్దింది. గర్భగుడిలోకి నీరు చేరడంతో, భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తున్నారు.