ఆత్మకూరు మండలం కరివెన గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ, సమస్యలపై స్పందించడం మంచి పాలనకు నిదర్శనమని స్థానికులు పేర్కొన్నారు.