శ్రీశైలం: పికాసి పట్టి ఉపాధి పని చేసిన ఎంపీడీవో

63చూసినవారు
శ్రీశైలం: పికాసి పట్టి ఉపాధి పని చేసిన ఎంపీడీవో
బండి ఆత్మకూరు మండలం పరమటూరు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో దస్తగిరి గురువారం పరిశీలించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వేతనదారులకు వివరించారు. కొలతల ప్రకారం పని చేయాలని, ప్రతి కుటుంబం 100 రోజుల పని పొందాలని, ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీడీవో వేతన దారులతో కలిసి వేతన దారుల పనిముట్లతో కొద్దిసేపు పనిచేశారు.

సంబంధిత పోస్ట్