శ్రీశైలం దేవస్థాన వైద్యశాల ను శ్రీశైల దేవస్థానం కార్యా నిర్వహణ అధికారి శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీశైలం దేవస్థానం వైద్యశాలను మరింతగా అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వైద్యశాలలో అవసరమైన మందులన్నింటిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అత్యవసర సమయంలో రోగులను ఇతర ప్రాంతాలకు తరించేందుకు నిరంతరం అంబులెన్సులు అందుబాటులో ఉండాలన్నారు.