ఆత్మకూరులోని తాగునీటి బావుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్ కు ఆరో వార్డుకు చెందిన టిడిపి నాయకులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలోని సిద్దేపల్లి రస్తలో ఉన్న తాగునీటి బావిలో ఇటీవల యువకుడు శవమై కనిపించడంతో ఆ కాలనీవాసులు ఆ నీరు తాగిందుకు భయపడుతున్నారని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా బావికి రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.