శ్రీశైలం జలాశయం గేట్లు ముచ్చటగా మూడోసారి ఎత్తి నాగార్జునసాగర్ కు అధికారులు నీటి విడుదలను చేపట్టారు. నదీ పరీవాహక ప్రాంతాల నుంచి 1,06,259 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్ నీటిమట్టం 885 అడుగులకు చేరడంతో గురువారం ఉదయం 09:30 గం. లకు డ్యామ్ ఒక గేటు ద్వారా నీటి విడుదల చేపట్టి 27 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేశారు.