మహానంది మండలంలో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని అధికారులకు గురువారం సూచించారు. మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మహబూబ్ దౌల ఆధ్వర్యంలో ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని అధ్యక్షతన మహానంది మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి, ఈవోఆర్డి నాగేంద్రుడు తదితరులు పాల్గొన్నారు.