శ్రీశైలం డ్యామ్ ను గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు ఆదివారం పరిశీలించారు. జలాశయం నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్ పూల్ ఏర్పడింది. దీని వల్ల డ్యామ్ కు ప్రమాదం లేదని అన్నారు. రాబోయే ఐదేళ్లలో కొత్త రేడియల్ క్రస్ట్ గేట్లు అమర్చుకోవాలని తెలిపారు. ప్రస్తుతం మెయింటెనెన్స్ బాగుందని అన్నారు.