జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడతా - బుడ్డా

51చూసినవారు
జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడతా - బుడ్డా
శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోని జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతుగా పాటుపడతానని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన శ్రీశైలం అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని శనివారం ఆత్మకూరు ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :