కొత్తపల్లి మండల డిప్యూటీ తహసిల్దార్ పెద్దన్నకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఉత్తమ సేవా అవార్డు వరించింది. ఈ మేరకు గురువారం నంద్యాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. అవార్డు రావడం తనలో మరింత బాధ్యత పెంచిందని డిప్యూటీ తాసిల్దార్ పెద్దన్న వెల్లడించారు.