కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా వెలుగోడు మాధవరం గ్రామాలలో సీసీ రోడ్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అన్నారపు శేషిరెడ్డి ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ ఖలీల్ ఖాన్ మోమిన్ రసూల్ పాల్గొన్నారు.