వెలుగోడు మండల పరిధిలోని వేల్పనూరు గ్రామంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తన స్వగృహంలో గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొంది ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 35 దరఖాస్తు చేసుకున్నారన్నారు. 35 మంది బాధితులకు మంజూరైన రూ. 1623711/- విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.