వెలుగోడు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో రైతులుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కిసాన్ డ్రోన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి, పాల్గొని, అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన ద్వారక రైతు మిత్ర గ్రూప్ కు డ్రోన్‌ను అందజేశారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని దిగుబడి పెంపొందించుకోవాలి అన్నారు.