శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా సోమవారం నాటికి అది 812.30 అడుగులకు తగ్గింది. మొత్తం నీటి సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా జలాశయంలో 38.8575 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బ్యాక్ వాటర్ ద్వారా 3,006 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. నీటి నిల్వలు క్రమంగా తగ్గుతుండటంతో సాగునీటి అవసరాలపై రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాకాలం వరకు నీటి వినియోగాన్నినియంత్రించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.