యనకండ్ల గ్రామంలో వైయస్సార్ విగ్రహం ధ్వంసం

65చూసినవారు
యనకండ్ల గ్రామంలో వైయస్సార్ విగ్రహం ధ్వంసం
బనగానపల్లె మండలంలోని యనకండ్ల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి చేరుకొని ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016 లో కూడా ఇదే గ్రామంలో వైయస్సార్ విగ్రహాన్ని దుండగులు దాడి చేశారని వివరించారు. ఇది సరైన సంస్కృతి కాదన్నారు.

సంబంధిత పోస్ట్