విజయవాడలో వరదలతో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆదుకునేందుకు చాలా మంది దాతలు ముందుకు వచ్చి వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందజేస్తూ ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ వరద బాధితులకు అండగా నిలిచారు. ప్రభుత్వం తనకిచ్చే ఒక సంవత్సర వేతనాన్ని రూ. 60వేలు విజయవాడ వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నట్టు శనివారం ప్రకటించారు. దీంతో పలువురు కౌన్సిలర్లు నజీర్ అహ్మద్ ను అభినందించారు.