గోనెగండ్ల మండలంలోని కులుమాల గ్రామానికి చెందిన చిన్న ఏసన్న (39) గుండెపోటుతో మృతిచెందాడు. మంగళవారం ఉపాధి పనుల్లో భాగంగా కాలువలో పూడికతీత చేస్తున్నప్పుడు గుండెపోటు రావడంతో కింద పడ్డాడు. తోటి కూలీలు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా, అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఉపాధి హామీ సిబ్బంది ఆయన ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. గ్రామస్తులు, కుటుంబం ప్రభుత్వం సహాయం అందించాలని కోరుతున్నారు.