రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ తేదీలని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం నాయకులు ఆత్కూర్ లోని పాఠశాల విద్యా భవన్ కార్యాలయం ముందు శుక్రవారం నాడు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర మాట్లాడుతూ, డీఎస్సీ నోటిఫికేషన్ తేదీల్ని ప్రకటించని కారణంగా అభ్యర్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.