పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బి. శివరాముడు గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రూ. 22.53 లక్షల పనులు చేశారన్నారు. కానీ ఇంకా రూ. 10.93 లక్షలు తన బ్యాంకు ఖాతాలోకి జమ కాలేదని సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌కు ఫిర్యాదు చేశారు. పలుమార్లు అడిగినా అధికారులు బ్యాలెన్స్ లేదంటూ చెప్పడంతో న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ ఆశ్రయించారు.