ఎమ్మిగనూరులో అన్న క్యాంటీన్ను సందర్శించిన కమిషనర్

50చూసినవారు
ఎమ్మిగనూరులో అన్న క్యాంటీన్ను సందర్శించిన కమిషనర్
ఎమ్మిగనూరులోని స్థానిక సోమప్ప సర్కిల్ అన్న క్యాంటీన్ ను శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి సందర్శించారు. అల్పాహారం పంపిణీని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నిరుపేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం ఈ క్యాంటీన్లను ప్రారంభించిందని, ఆహార పంపిణీలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అక్కడి సిబ్బందికి సూచించారు. అక్కడికి వచ్చిన వారితో మాట్లాడి అల్పాహారం రుచి గురించి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్