జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఏపీ రాష్ట్ర మహిళా సాధికారిత చైర్మన్, ఎమ్మిగనూరు ఇన్ చార్జ్ రేఖాగౌడ్ పిలుపు మేరకు ఎమ్మిగనూరు జనసేన పార్టీ నాయకులు బోయ రామకృష్ణ, లక్ష్మన్న ఆధ్వర్యంలో పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సోసైటీ పేద అనాధ బాలుర సంరక్షణ కేంద్రంలోని పిల్లలకు సోమవారం భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిత్యవసర సరుకులు, ఫ్యాన్ సొసైటీ అధ్యక్షులు నరసన్నకు అందజేశారు.