పెద్దకడబూరు మండలం చిన్నకడబూరులో గురువారం నలుగురు కుక్కలు దాడిచేసి 26 గొర్రె పిల్లలను చంపేశాయి. నాగయ్య గారి ఈరన్న, దొడ్డి తిమ్మారెడ్డి, తిక్కయ్యలకు చెందిన 55కు పైగా గొర్రె పిల్లలు ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. స్థానికులు రెండు కుక్కలను హతమార్చారు. బాధితుల ప్రకారం రూ.1.50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు.