ఎమ్మిగనూరు మండలం బనవాసి గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడిన లైబ్రేరియన్ పై అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుట్టారేణుక డిమాండ్ చేశారు. గురువారం ఆమె మాట్లాడారు. మహిళా కళాశాలల్లో మహిళా అధ్యాపకులు, సిబ్బందినే నియమించాలని సూచించారు. శాంతిభద్రతలు, మహిళల రక్షణపై చర్యలు తీసుకోవాలన్నారు.