ఎమ్మిగనూరు: లింగనిర్ధారణ స్కానింగ్ కేంద్రాలపై చర్యలు

56చూసినవారు
ఎమ్మిగనూరు: లింగనిర్ధారణ స్కానింగ్ కేంద్రాలపై చర్యలు
కర్నూలు జిల్లాలో స్కానింగ్ కేంద్రాలను తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ పి. శాంతికళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏప్రిల్‌లో 40 కేంద్రాలను తనిఖీ చేసిన బృందాలు, భవిష్యత్తులో కేంద్రాలపై మరింత కఠిన చర్యలు తీసుకుంటాయని ప్రకటించారు. లింగనిర్ధారణ, అబార్షన్ చేసే కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఫిర్యాదులపై దాడులు నిర్వహించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్