ఎమ్మిగనూరు ప్రభుత్వ హాస్పిటల్ లో నవజాత శిశువు మరణంపై విచారణకు వచ్చిన కర్నూలు డిసిహెచ్ఎస్ మాధవిలతకి బుధవారం అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శ రాజీవ్ మాట్లాడుతూ.. ఎమ్మిగనూరులో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యుల సంఖ్య ఆధునిక పరికరాలు నవజాత శిశువులకు సరైన వెంటిలేషన్ సౌకర్యం పిల్లల వైద్యులు లేకపోవడం వల్ల బిడ్డను కోల్పోయారన్నారు.