ఎమ్మిగనూరు మండలం బనవాసి గురుకుల బాలికల కళాశాలకు ప్రభుత్వం కొత్త మహిళ ప్రిన్సిపాల్ గిరివాణిని నియమించింది. శుక్రవారం ఆమె మాట్లాడారు. విద్యార్థిపై లైబ్రేరియన్ లైంగిక వేధింపులకు పాల్పడడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యిందని, పోక్సో కేసు నమోదు చేసి, అరెస్టు చేశారన్నారు. ఘటనకు బాధ్యుడిని చేస్తూ ప్రిన్సిపల్ శ్రీనివాస గుప్తాను ప్రభుత్వం సస్పెండ్ చేసిందన్నారు. ఆయన స్థానంలో ప్రిన్సిపాల్ గా గిరివాణి వచ్చారు.