పోలీసు స్టేషన్ కు వచ్చే వారితో గౌరవప్రదంగా నడుచుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్ సూచించారు. గురువారం ఎమ్మిగనూరు పట్టణ, రూరల్, గోనెగండ్ల పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ, సాధారణ తనిఖీ భాగంగా రికార్డులను పరిశీలించారు. ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు, పట్టణ సీఐ శ్రీనివాసులు, గోనెగండ్ల సీఐ గంగాధర్, రూరల్ సీఐ బీవీ మధుసూదనరావు, తదితరులు పాల్గొన్నారు.