ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, కళాశాలల వేధింపులు పెరుగుతున్నాయని ఎమ్మిగనూరు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు జి. బలరాం యాదవ్ శనివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యార్ధుల భవిష్యత్తును అగాధంలోకి నెట్టి, వారిని ఉన్నత విద్యకు దూరం చేస్తోందని విమర్శించారు.