పేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మిగనూరులో ఆయన నివాసంలో మాట్లాడుతూ, పేదల వైద్యానికయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా భరిస్తూ వారిని అప్పుల బారి నుంచి కాపాడుతోందన్నారు. పదినెలల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందిన 35 మంది బాధితులకు సుమారు రూ.50 లక్షల సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు.