నగరంలోని యాపిల్ ల్యాబ్ ను శుక్రవారం ఆదోని డిప్యూటీ డీ.ఎం.ఆండ్.హెచ్.ఓ సత్యవతి తనిఖీ చేశారు. గత నెలలో జిల్లా అధికారులు ఈ ల్యాబ్ ను తనిఖీ చేసి ట్రేడ్ లైసెన్స్, ఫాథలజీ సర్టిఫికేట్, బయో మెడికల్ సర్టిఫికేట్ లు లేవని సిబ్బందికి షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది. తాజాగా సత్యవతి మరోసారి తనిఖీలు చేసి, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ కు అన్ని అనుమతులు ఉన్నాయని అన్నారు. ఎమ్మిగనూరులో ఉన్న రక్త పరీక్ష కేంద్రాలు, ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్ల యాజమాన్యం అన్ని శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రెన్యూవల్ చేయించుకోలేని వారు కూడ రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు.