ఎమ్మిగనూరు: అప్పుల భారంతో రైతు ఆత్మహత్య

69చూసినవారు
ఎమ్మిగనూరు: అప్పుల భారంతో రైతు ఆత్మహత్య
గోనెగండ్ల మండలం ఐరన్ బండ గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు (42) పంట నష్టాలు, భారీ అప్పుల భారం తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం సీఐ విజయభాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం. మూడు ఏళ్లుగా వరుసగా నష్టాలు వాటిల్లడంతో రూ. 10 లక్షల అప్పులో కూరుకున్నాడు. ఈనెల 10న విషం తీసుకున్న ఆయన, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.

సంబంధిత పోస్ట్