ఎమ్మిగనూరు: రైతు కుటుంబానికి రూ.7 లక్షల చెక్కు అందజేత

62చూసినవారు
ఎమ్మిగనూరు: రైతు కుటుంబానికి రూ.7 లక్షల చెక్కు అందజేత
ఎమ్మిగనూరు మండలంలోని కడివెల్ల గ్రామానికి చెందిన ఈడిగ నరసింహులు అప్పుల బారినపడి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనపై ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి స్పందించారు. బుధవారం బాధిత కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ, టీడీపీ ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.7 లక్షల ఆర్థిక సహాయం చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ, కార్యకర్తలకు టీడీపీ భీమా పథకం ఎంతో దోహద పడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్