ఖరీఫ్ సీజన్ ప్రారంభంతో యూరియా కొరత రైతులను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఎమ్మిగనూరులో యూరియా కోసం వందలాది మంది రైతులు వేచి చూస్తున్నారు. పీఏసీఎస్ నిర్ణీత ధరకు ఒక్కొక్కరికి మూడు బస్తాల చొప్పున మాత్రమే ఇవ్వగా, కేవలం రెండు లారీలే రావడం వల్ల చాలామంది యూరియా లభించక వెనుదిరిగారు.