ఎమ్మిగనూరు పట్టణం కోసిగి రోడ్డులో మూడు అంతస్తుల భవనం నుండి కూలిన గోడ వలన 14 మంది పేద ప్రజలు గాయపడ్డారని సిపిఐ నాయకుడు ఎం. సత్యన్న అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ గాయపడిన వారికి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ, కమిషనర్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనలో కురువ శ్రీరాములు కుటుంబంలోని ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారని, వారిని కర్నూలు కేర్ హాస్పిటల్ కు తరలించి చికిత్స పొందుతున్నారు.