ఎమ్మిగనూరు మండలం టీఎస్ కూళ్లూరు గ్రామంలో గురువారం ఇంటి పక్కన ఉన్న చెట్లు విషయంలో దాయాదులైన బోయ పెద్ద ఈరన్న, బోయ రామచంద్ర కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన బోయ పెద్ద ఈరన్న, బోయ రామచంద్రలు దాయాదులు రెండు ఇళ్ల మధ్య ఉన్న చెట్లను బోయ రామచంద్ర నరకివేయడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవకు దారి తీసింది. ఘటనపై విచారిస్తున్నామని రూరల్ పోలీసులు తెలిపారు.