ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలం అలువాల గ్రామంలో శుక్రవారం అక్రమంగా మద్యం అమ్ముతున్న పిచ్చిగుంట్ల కృష్ణను అరెస్టు చేసినట్లు సీఐ విజయభాస్కర్ తెలిపారు. మద్యం సరఫరా చేస్తున్న సి. బెలగల్ గోపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాబడిన సమాచారంతో కృష్ణ ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులు 39 కర్ణాటక మద్యం బాటిళ్లు, 2 ఆంధ్ర మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.